హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బాలికపై లైంగిక దాడి.. నిందితుడి అరెస్ట్!

PLD: మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో నకరికల్లు మండలానికి చెందిన 23 ఏళ్ల యువకుడిని పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. బాలికకు మాయమాటలు చెప్పి అఘాయిత్యానికి పాల్పడి, విషయం బయటకు చెబితే చంపుతానని బెదిరించినట్లు తేలింది. సాంకేతిక ఆధారాలతో నిందితుడిని 24 గంటల్లోనే పట్టుకొని కోర్టులో హాజరుపరిచినట్లు డీఎస్పీ చైతన్య తెలిపారు.