హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గుంటూరులో తెగిపడ్డ హైటెన్షన్ వైర్లు!

గుంటూరులోని సంగడిగుంట పరిధి బుడంపాడు బైపాస్ విద్యుత్ సబ్‌స్టేషన్ వద్ద గురువారం ప్రమాదవశాత్తు హైటెన్షన్ విద్యుత్ వైర్లు తెగిపడ్డాయి. దీంతో సంగడిగుంటతో పాటు పరిసర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. సమాచారం అందుకున్న వెంటనే విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని యుద్ధప్రాతిపదికన మరమ్మతు పనులు ప్రారంభించారు.