E.G: ఇళ్లకు తాళం వేసి ఇతర ప్రాంతాలకు వెళ్లే ప్రజలు జిల్లా పోలీసుల 'LHMS' సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ డి. నరసింహ కిషోర్ సూచించారు. 'LHMS AP POLICE' యాప్‌లో రిజిస్ట్రేషన్ చేసుకొని రిక్వెస్ట్ పంపిస్తే, ఇంటి వద్ద ఉచితంగా కెమెరా ఏర్పాటు చేసి కంట్రోల్ రూమ్‌కు అనుసంధానిస్తామని తెలిపారు. అనుమానాస్పద కదలికలను గుర్తించి సిబ్బందిని అప్రమత్తం చేస్తామన్నారు.
ఆంధ్రప్రదేశ్
'LHMS' సేవలు వినియోగించుకోండి: జిల్లా SP నరసింహ


