ప్రకాశం: కనిగిరి పట్టణంలో యుటీఎఫ్ ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం నిరసన ర్యాలీ నిర్వహించారు. యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి షేక్ రహంతుల్లా ఆధ్వర్యంలో టీచర్లు ఈటీఎఫ్ ఆఫీస్ నుంచి ఆర్డీవో కార్యాలయం వరకు బైక్ ర్యాలీ నిర్వహించి ఆర్డీవో కార్యాలయం ముందు నిరసన చేపట్టారు. అనంతరం వారు ఆర్డీవో కార్యాలయంలో వినతిపత్రం అందించి వెళ్లిపోయారు.
ఆంధ్రప్రదేశ్
కనిగిరిలో యూటీఎఫ్ నిరసన ర్యాలీ


