హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాకు వర్ష సూచన.. జాగ్రత్త..!

W.G: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుంది. దీని ప్రభావంతో వచ్చే నెల 2 వరకు ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎమ్‌డీ తెలిపింది. రేపు, ఎల్లుండి పిడుగులతో కూడిన వానలు పడే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నైరుతి రుతుపవనాల సీజన్‌లో వరుసగా అల్పపీడనాలు ఏర్పడుతున్నా, ఆశించిన స్థాయిలో వర్షపాతం నమోదవలేదని అధికారులు పేర్కొన్నారు.