హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేటి నుంచి ఉచిత సెల్‌ఫోన్ సర్వీసింగ్ శిక్షణ

SKLM: ఎచ్చెర్ల మండల కేంద్రంలోని యూనియన్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థలో శుక్రవారం నుంచి సెల్‌ ఫోన్ సర్వీసింగ్ శిక్షణ ప్రారంభించనున్నట్లు సంస్థ డైరెక్టర్ రామ్‌ జీ తెలిపారు. 19 నుంచి 45 ఏళ్ల వయసు గల నిరుద్యోగులు ఈ శిక్షణకు అర్హులని పేర్కొన్నారు. 30 రోజులపాటు జరిగే శిక్షణలో ఉచిత వసతి, భోజన సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు.