హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

క్యూఆర్ కోడ్ విధానాన్ని ఉపసంహరించాలని వినతి

E.G: ప్రభుత్వ రేషన్ షాపులలో క్యూఆర్ కోడ్ అమలు ఉత్తర్వులను ఉపసంహరించాలని కోరుతూ గోకవరం మండల రేషన్ డీలర్లు గురువారం తహసీల్దార్ పినిశెట్టి రామకృష్ణకు వినతిపత్రం అందజేశారు. ప్రతినెల షాపునకు 100 నుంచి 300 కేజీల వరకు తూకం లోపాలు వస్తున్నాయని, దీనివల్ల డీలర్లు తీవ్రంగా నష్టపోతున్నామని సంఘం అధ్యక్షుడు మలిరెడ్డి కృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు.