కోనసీమ: అమరావతిలో సీఎం చంద్రబాబుని ఎమ్మెల్సీ సోము వీర్రాజు గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. రాబోయే గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై చర్చించారు. పందిరిమామిడి తాటి పరిశోధన కేంద్రంగా ‘తాటి బోర్డు’ ఏర్పాటు ఆవశ్యకతను వివరించారు. తాటి బోర్డుతో కల్లుగీత కార్మికులకు ప్రయోజనాలు, తాటి ఉత్పత్తుల ద్వారా ఆదాయ మార్గాలపై సీఎంకు వివరించారు.
ఆంధ్రప్రదేశ్
సీఎం చంద్రబాబుతో సోము వీర్రాజు భేటీ


