హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రోడ్డు ప్రమాద బాధితులకు న్యాయం చేయాలి నిరసన

PLD: చిలకలూరిపేట రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి చెందిన ఘటనపై బాధితులకు న్యాయం చేయాలంటూ ఎమ్మార్పీఎస్ నేతలు 15 గంటలపాటు ఆందోళన చేపట్టారు. ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు స్వయంగా వచ్చి మాట్లాడాలని డిమాండ్ చేశారు. అధికారులు పలుమార్లు చర్చలు జరిపి పరిహారం, ఇంటి స్థలాలపై హామీ ఇచ్చినా ఆందోళనకారులు అంగీకరించలేదు. దీంతో శుక్రవారం ఉదయం వరకు నిరసన కొనసాగింది.