హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు ఉచిత వైద్య శిబిరం

PPM: పాలకొండ నగర పంచాయతీ కార్యాలయ ఆవరణలో శుక్రవారం ఉదయం 10 గంటలకు ఆయుష్ వైద్యులతో ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు కమిషనర్ నూకరాజు తెలిపారు. ఈ శిబిరంలో ఆయుర్వేద, హోమియో వైద్యులు పాల్గొని వివిధ రకాల వ్యాధులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తారని తెలిపారు. అవసరమైన మందులను ఉచితంగా పంపిణీ చేస్తామని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.