హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు సామూహిక వరలక్ష్మీ వ్రతాలు

BPT: ఇంకొల్లు హరిహర ధార్మిక సేవా సమితి ఆధ్వర్యంలో శుక్రవారం సామూహిక వరలక్ష్మి వ్రతం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. స్థానిక పద్మాల అంకమ్మ ఆలయ ప్రాంగణంలో ఉదయం 10గంటల నుంచి వ్రత పూజలు ప్రారంభిస్తామని, పూజా సామగ్రి ఉచితంగా అందజేస్తామని పేర్కొన్నారు. వ్రతంలో పాల్గొనే మహిళలు సమయానికి ఆలయానికి చేరుకోవాలని, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలన్నారు