హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఒంటిమిట్టలో నేడు సీతారాముల కల్యాణం

KDP: శ్రావణ మాసం రాఖీ పౌర్ణమి సందర్భంగా ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయంలో శుక్రవారం సీతారాముల కల్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించనున్నట్లు తితిదే అధికారులు తెలిపారు. ఉదయం 9.30 గంటలకు స్వామివారి సన్నిధిలో కల్యాణోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.