హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పల్లె నిద్రలో పోలీసులు..!

అన్నమయ్య: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో గ్రామాల్లో శాంతిభద్రతల పరిరక్షణకు అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాలతో పోలీసులు ‘పల్లె నిద్ర’ కార్యక్రమం చేపట్టారు. గ్రామాల్లో రాత్రి వేళ బస చేస్తూ మహిళల భద్రత, బాల్య వివాహాలు, సైబర్ నేరాలు, దొంగతనాల నివారణపై ప్రజలకు అవగాహన కల్పించారు. అసాంఘిక శక్తులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.