KDP: వేంపల్లెలో 11KV ఆర్టీసీ ఫీడర్ పరిధిలో మరమ్మతుల కారణంగా శుక్రవారం పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఇన్‌ఛార్జ్ ఏఈ మైకెల్ జాక్సన్ తెలిపారు. కడప రోడ్డు, ఎస్సీ కాలనీ, ఆర్టీసీ బస్టాండ్, ప్రభుత్వ ఆసుపత్రి, పోలీస్ స్టేషన్, బ్యాంక్ సర్కిల్, పాతపేట తదితర ప్రాంతాల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు సరఫరా ఉండదని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
విద్యుత్ సరఫరాకు అంతరాయం


