హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం

GNTR: తెనాలి మండలం గాంధీనగర్  పట్టణ పేద నిరాశ్రయుల ఆశ్రమంలో ఈ నెల 29న ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు శ్రీ వేంకటేశ్వర యోగా సేవా కేంద్రం నిర్వాహకులు రమణయ్య ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ ఆయుర్వేద ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేస్తారని పేర్కొన్నారు. ఈ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.