సత్యసాయి: అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఇళ్లు మంజూరు చేస్తామని ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి తెలిపారు. ఆగిన గృహ నిర్మాణాలను సకాలంలో పూర్తి చేయడానికి సహకరిస్తామన్నారు. ఎంపీడీవో కార్యాలయంలో మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డితో కలసి హౌసింగ్ లబ్ధిదారులతో సమీక్షించారు. పుట్టపర్తిలో ఫైటర్ జెట్ పరిశ్రమ, ఆమడగూరులో రిలయన్స్ సోలార్ ప్రాజెక్ట్ ఏర్పాటు అవుతాయన్నారు.
ఆంధ్రప్రదేశ్
అర్హులందరికీ ఇళ్లు మంజూరు చేస్తాం: ఎమ్మెల్యే


