KDP: స్థానిక ట్రాన్స్‌జెండర్లకు రూరల్ SI రాజు గురువారం రాత్రి కౌన్సెలింగ్ ఇచ్చారు. రోడ్లపై ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించడం, డబ్బులు డిమాండ్ చేయడం, ప్రజలు, వాహనదారులను దూషించడం లేదా దాడులకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. అసభ్యకర చర్యలకు దూరంగా ఉండాలని సూచించారు. ఏవైనా సమస్యలు ఉంటే పోలీసులను ఆశ్రయిస్తే చట్టపరంగా రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్
ట్రాన్స్‌జెండర్లకు ఎస్సై కౌన్సెలింగ్


