హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చేబ్రోలులో జాబ్ మేళా!

GNTR: ఈ నెల 31న చేబ్రోలు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి కొండా సంజీవరావు తెలిపారు. పదో తరగతి, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, పీజీ విద్యార్హత కలిగి 18 నుంచి 35 ఏళ్లలోపు వయస్సు ఉన్నవారు అర్హులని పేర్కొన్నారు. అభ్యర్థులు బయోడేటా, ధ్రువపత్రాల నకళ్లతో హాజరుకావాలని సూచించారు.