హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాలో పాడి రైతులకు దాణా పంపిణీ

కృష్ణా: పాడి రైతులకు ప్రభుత్వం 50 శాతం రాయితీపై దాణా అందజేస్తోందని పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ నాగభూషణం తెలిపారు. గురువారం పెడన పశువుల ఆసుపత్రి వద్ద రైతులకు రాయితీ దాణాను పంపిణీ చేశారు. రూ.1,110 విలువైన దాణా బస్తాను రూ. 555కే అందిస్తున్నట్లు తెలిపారు. పెడన మండలంలో ఇప్పటివరకు 20 టన్నుల దాణాను రైతులకు సరఫరా చేసినట్లు పేర్కొన్నారు.