హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు పెడన మండలంలో SLAS సర్వే పరీక్ష

కృష్ణా: పెడన మండలంలోని ఏడు పాఠశాలల్లో నేడు స్టేట్ లెర్నింగ్ అచీవ్‌మెంట్ సర్వే (SLAS) పరీక్ష నిర్వహించనున్నారు. 5, 7, 9వ తరగతుల విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను తెలుగు, ఆంగ్లం, గణితం సబ్జెక్టుల్లో అంచనా వేయనున్నారు. నందిగామ, కాకర్లమూడిపాలెం ప్రాథమిక పాఠశాలలు, పెనుమల్లి హైస్కూల్, బట్ట జ్ఞానకోటయ్య హైస్కూల్ సర్వేకు ఎంపికయ్యాయి.