తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ ఆలయంలో పౌర్ణమి సందర్భంగా శుక్రవారం చండీహోమం నిర్వహిస్తున్నట్లు ఆలయ ఛైర్మన్ నైనార్ మహేష్ యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు. భక్తులు రూ.1000 చెల్లించి హోమంలో పాల్గొనవచ్చని, తీర్థప్రసాదాలు అందజేస్తామని ఈవో జయకుమార్ తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
నేడు గుంట గంగమ్మ ఆలయంలో చండీహోమం


