హైదరాబాద్: 28°C
క్రీడలు

వరుస సెంచరీలు.. చరిత్ర సృష్టించిన సోనల్

భారత్‌పై ఒకే టెస్టు మ్యాచ్ రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ సెంచరీలు సాధించిన మూడో ఆటగాడిగా శ్రీలంక బ్యాటర్ సోనల్ దినుష నిలిచాడు. సోనల్ కంటే ముందు 1982లో చెన్నై టెస్టులో దలీప్ మెండిస్, 1997లో కొలంబో టెస్టులో అరవింద డిసిల్వా ఈ ఘనత సాధించాడు. దాదాపు 29 ఏళ్ళ తర్వాత మళ్ళీ భారత్‌పై ఈ అరుదైన మైలురాయిని చేరుకున్న శ్రీలంక ఆటగాడిగా దినుష నిలవటం గమనార్హం.