PPM: ప్రయాణికుల రద్దీని నియంత్రించేందుకు రైల్వే శాఖ అదనపు రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆగస్టు 28 నుంచి 30 వరకు విశాఖ-విజయవాడ (07215/16), విశాఖ-పార్వతీపురం (07268/67) మధ్య అన్ రిజర్వుడ్ జనసాధారణ్ ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. 12 కోచ్లతో సాగే ఈ రైళ్లను ప్రయాణికులు వినియోగించుకోవాలని అధికారులు సూచించారు.
ఆంధ్రప్రదేశ్
ప్రయాణికుల రద్దీకి అదనపు జనసాధారణ్ ప్రత్యేక రైళ్లు


