SKLM: సోంపేట మండల పరిషత్తు సర్వసభ్య సమావేశం సెప్టెంబర్ 2న నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో ఈశ్వరమ్మ తెలిపారు. ఎంపీపీ ఎన్.దాసు అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి అన్ని శాఖల అధికారులు పూర్తి వివరాలతో హాజరు కావాలని కోరారు. అభివృద్ధి పనులు, నిధుల వినియోగం, ప్రభుత్వ పథకాల అమలుపై చర్చించనున్నట్లు తెలిపారు. సభ్యులు ప్రజా సమస్యలను లేవనెత్తనున్నట్లు పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
సోంపేటలో సర్వసభ్య సమావేశం


