హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సీఎం పర్యటనపై హోంమంత్రి సమీక్ష

అనకాపల్లి జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన ఖరారైంది. వచ్చే నెల 2న పాయకరావుపేటకు రానున్నారు. పోలవరం ఎడమ కాలువ జలహారతి కార్యక్రమానికి హాజరుకానున్నారు. దీంతో సీఎం పర్యటనపై మంత్రి అనిత అధికారులతో సమీక్షించారు. ఉత్తరాంధ్ర రైతుల కల నెరవేరబోతోందన్నారు. కాలువ నీటితో రైతులకు ఎంతో మేలు జరుగుతుందని ఆమె పేర్కొన్నారు.