హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అధికారులకు ‘స్వర్ణాంధ్ర’ ప్రత్యేక శిక్షణ

AKP: ‘స్వర్ణాంధ్ర @ 2047’ లక్ష్య సాధనకు అనకాపల్లి జిల్లా అధికారులకు 12 రోజుల ప్రత్యేక శిక్షణ ప్రారంభమైంది. గురువారం దీనిపై కలెక్టర్ విజయ కృష్ణన్ వివరాలు వెల్లడించారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి అధికారులను సన్నద్ధం చేస్తున్నట్లు తెలిపారు. పహలే ఇండియా ఫౌండేషన్ సహకారంతో ఆర్థిక సూచీలు, క్షేత్రస్థాయి ప్రణాళికల అమలుపై శిక్షణ ఇస్తున్నట్లు పేర్కొన్నారు.