హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విలేజ్ హెల్త్ క్లినిక్ భవన నిర్మాణానికి శంకుస్థాపన

VZM: భోగాపురం మండలం బైరెడ్డిపాలెం పంచాయతీలో విలేజ్ హెల్త్ క్లినిక్ భవన నిర్మాణానికి ఎమ్మెల్యే లోకం మాధవి భూమి పూజ చేసి శంకుస్థాపన నిర్వహించారు. గ్రామ ప్రజలకు మెరుగైన ప్రాథమిక వైద్య సేవలు అందేలా నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. అలాగే, గ్రామస్తులు సంకల్పించిన నూతన ఆలయ నిర్మాణానికి సహకారం అందిస్తానని ఆమె హామీ ఇచ్చారు.