విశాఖపట్నం సౌత్ జోనల్ కార్యాలయంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ పారిశుధ్య కార్మికులకు కొబ్బరినూనె, సబ్బులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎండ, వర్షాలను లెక్కచేయకుండా నగర పరిశుభ్రత, ప్రజల ఆరోగ్యం కోసం కార్మికులు చేస్తున్న సేవలు అభినందనీయమన్నారు. కార్మికుల సంక్షేమం, ఆరోగ్య పరిరక్షణకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది అని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
'ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యత'


