AKP: రోలుగుంట ఎస్టీ కాలనీ, ఎస్సీ కొవ్వూరు రోడ్డులో తాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరుతూ గురువారం ఎంపీడీవో నాగేశ్వరరావుకు స్థానికులు వినతిపత్రం అందజేశారు. నెల రోజులుగా కొళాయిల్లో నీరు రాక 50 కుటుంబాలు, 200 మందికి పైగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారు తెలిపారు. వెంటనే కొళాయిలు లేదా ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేసి ఆదుకోవాలని ప్రజాసంఘాల నేతలు కోరారు.
ఆంధ్రప్రదేశ్
మంచినీటి సమస్య తీర్చాలని వినతి


