SS: భర్తను కోల్పోయి బాడుగ బండిపై బజ్జీలు అమ్ముతూ పిల్లలను చదివిస్తున్న లీలావతికి మంత్రి సవిత అండగా నిలిచారు. గోరంట్లలో తనను కలసి ఆవేదన వ్యక్తం చేసిన లీలావతికి సొంత డబ్బుతో తోపుడు బండిని అందజేశారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మంత్రికి లీలావతి కృతజ్ఞతలు తెలిపారు. పేదలు, మహిళలు ఆర్థికంగా ఎదిగేలా అండగా నిలవడమే లక్ష్యమని మంత్రి వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్
లీలావతికి సొంత తోపుడు బండి అందజేత


