హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అధికారులపై ఎమ్మెల్యే దగ్గుపాటి ఆగ్రహం

ATP: అనంతపురం జడ్పీ సమావేశంలో కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోని అధికారులను ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ నిలదీశారు. రెండేళ్లుగా తాగునీటి పనులు నిలిపివేసిన వారిని వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. సూపర్ ఎల్-నినో ప్రభావంతో కేవలం తాగునీటికే ప్రాధాన్యమిస్తున్నామని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో ఉందని తెలిపారు.