MDK: రామాయంపేట (మం) పరిధిలోని అక్కన్నపేట పీఏసీఎస్ వద్ద యూరియా కోసం రైతులు భారీగా బారులు తీరారు. ఎరువుల కోసం తోపులాట జరగకుండా రామాయంపేట పట్టణ పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేసి, లైన్లలో క్రమపద్ధతిలో యూరియా పంపిణీ జరిగేలా చూశారు. దీంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పంపిణీ పూర్తయింది.
తెలంగాణ
పోలీస్ బందోబస్తుతో యూరియా పంపిణీ


