NTR: జగ్గయ్యపేటలోని GVJZPHS బాలుర పాఠశాలలో హరిత ఆంధ్ర స్వచ్ఛంద సంస్థ పర్యావరణ పరిరక్షణ కార్యక్రమం నిర్వహించింది. విద్యార్థులకు 250 మొక్కలు పంపిణీ చేశారు. పూర్వ విద్యార్థి సామినేని ఉదయభాను ఆధ్వర్యంలో పిల్లలతో ఐదు అంశాలపై ప్రమాణం చేయించారు. మొక్కలు నాటడం, ప్లాస్టిక్ తగ్గించడం, పరిసరాల శుభ్రత, నార సంచుల వాడకం, సైకిల్ వినియోగంపై విద్యార్థులు ప్రతిజ్ఞ చేశారు.
ఆంధ్రప్రదేశ్
పర్యావరణ పరిరక్షణకు విద్యార్థుల ప్రతిజ్ఞ


