హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కేజీబీవీలో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం

AKP: ఎస్ రాయవరం మండలం కేజీబీవీలో కొరుప్రోలు ప్రభుత్వ ఆయుర్వేద ఆసుపత్రి ఆధ్వర్యంలో గురువారం ఉచిత ఆయుష్ వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఆయుర్వేద వైద్య అధికారి డాక్టర్ రఘు 260 మంది విద్యార్థినులను పరీక్షించి మందులను ఉచితంగా అందజేశారు. ఆరోగ్యంగా ఉండడానికి తీసుకోవలసిన జాగ్రత్తలను వివరించారు. ముఖ్యంగా పరిశుభ్రత పాటించాలన్నారు.