కృష్ణా: జిల్లాలోని కంకిపాడు మండలంలో గురువారం డయేరియా కలకలం రేపింది. పలువురు బాధితులు కంకిపాడు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందారు. చికిత్స అనంతరం 15 మందిని డిశ్చార్జ్ చేసినట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ముగ్గురు బాధితులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితిని వైద్య సిబ్బంది పర్యవేక్షిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
డయేరియా కేసులతో కలకలం


