హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఉద్యోగులు గైర్వాజారు..మంత్రి సీతక్క ఆగ్రహం

MLG: ములుగులోని పంచాయతీరాజ్‌, ఉద్యానశాఖ జిల్లా కార్యాలయాలను ఇవాళ మంత్రి సీతక్క ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యాలయాల్లో ఉన్నతాధికారులు, సిబ్బంది పలువురు విధులకు హాజరుకాకపోవడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. CPS వ్యతిరేక నిరసనకు కొందరు వెళ్లగా, మరికొందరు కార్యాలయాలకు రాకపోవడాన్ని గుర్తించారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు.