హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కాపవరంలో రోడ్డు ప్రమాదం.... వ్యక్తికి తీవ్రగాయాలు

E.G: కొవ్వూరు మండలం కాపవరం జాతీయ రహదారిపై గురువారం బైక్ అదుపు తప్పి పడటంతో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. రోడ్డుపై రక్తపు మడుగులో పడి ఉన్న క్షతగాత్రుడిని గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అటుగా వెళ్తున్న వాహనదారులు 108 అంబులెన్స్‌కు ఫోన్ చేసి ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.