E.G: దేవరపల్లి మండలం కృష్ణంపాలెం జాతీయ రహదారి ఫ్లెఓవర్ వద్ద పెళ్లి బృందం కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. కృష్ణా జిల్లా పామర్రుకు చెందిన బాధితులు ద్వారకాతిరుమలలో వివాహం చేసుకొని, అన్నవరం సత్యనారాయణ స్వామిని దర్శించుకుని వస్తుండగా ఈ ఘటన జరిగింది. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.
ఆంధ్రప్రదేశ్
పెళ్లి కారు బోల్తా.. నలుగురికి గాయాలు


