HNK: ఆత్మకూరు మండలం కొత్తగట్టు గ్రామంలోని ప్రాథమిక పాఠశాలను గురువారం కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులకు అందుతున్న విద్యాబోధన, హాజరు, మౌలిక వసతులను పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి వారి చదువు, పాఠశాలలోని సౌకర్యాల గురించి తెలుసుకున్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని ఉపాధ్యాయులను కలెక్టర్ ఆదేశించారు.
తెలంగాణ
పాఠశాలను సందర్శించిన జిల్లా కలెక్టర్


