నేపాల్‌లో సంభవించిన భారీ వరదలతో పలువురు తెలుగువారు చిక్కుకున్నట్లు సమాచారం అందుతోంది. ఈ క్రమంలో హైదరాబాద్‌కు చెందిన కందిమళ్ల సుహాసిని రెడ్డి కూడా అదృశ్యమైనట్లు తెలుస్తోంది. నిన్నటి నుంచి కుటుంబ సభ్యులకు ఆమె ఫోన్‌లో అందుబాటులోకి రాకపోవడంతో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. సుహాసిని ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు అధికారులను సంప్రదిస్తూ ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నారు.
తెలంగాణ
నేపాల్ వరదల్లో హైదరాబాద్ యువతి అదృశ్యం


