హైదరాబాద్: 28°C
తెలంగాణ

స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

PDPL: అంతర్గాం గ్రామంలో గురువారం నిర్వహించిన గ్రామ సభ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ పాల్గొన్నారు. గ్రామ ప్రజల సమస్యలు, స్థానికంగా చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై గ్రామ సభలో చర్చించారు. అర్హులైన లబ్దిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన వారికి అందేలా కృషి చేస్తానన్నారు.