హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సీఎం పర్యటనపై కలెక్టర్ సమీక్ష

ASR: ఈనెల 29న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరకులోయ పర్యటన నేపథ్యంలో గురువారం కలెక్టర్ నిశాంతి జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. సీఎం పర్యటనకు సంబంధించి ఆయా శాఖలు చేపట్టిన ఏర్పాట్లు, కార్యక్రమాల పురోగతిని అధికారులు వివరించారు. పర్యటనలో లోటుపాట్లు లేకుండా విజయవంతంగా నిర్వహించేందుకు కలెక్టర్ తగిన సూచనలు, ఆదేశాలు జారీ చేశారు.