హైదరాబాద్: 28°C
తెలంగాణ

కాంగ్రెస్‌లో భారీ చేరికలు

HYD: టీపీసీసీ ఉపాధ్యక్షుడు, కూకట్‌పల్లి కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ బండి రమేశ్ సమక్షంలో అల్లాపూర్ డివిజన్ శివాజీనగర్‌లో భారీ చేరికలు జరిగాయి. వివిధ పార్టీలకు చెందిన పలువురు నేతలు, కార్యకర్తలు కాంగ్రెస్‌లో చేరారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై వీరంతా పార్టీలో చేరినట్లు బండి రమేశ్ తెలిపారు. పార్టీ బలోపేతానికి అందరూ కృషి చేయాలన్నారు.