హైదరాబాద్: 28°C
తెలంగాణ

ట్రాఫిక్‌కు అంతరాయం.. ప్రయాణికులకు అలర్ట్

HYD: మొనప్ప-ప్రజాభవన్ మార్గంలో పైప్‌లైన్ పనుల వల్ల ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలుగుతోందని హైదరాబాద్ పోలీసులు అలర్ట్ ఇచ్చారు. వాహనాల రాకపోకలు నెమ్మదించే అవకాశం ఉన్నందున, వాహనదారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని, అత్యవసర ప్రయాణికులు ముందస్తుగా సమయం కేటాయించుకుని బయల్దేరాలని అధికారులు సూచించారు.