హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే

JN: జఫర్ గడ్ మండలం సాగరం గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లను ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రారంభించారు. అనంతరం పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. నియోజకవర్గంలోని ప్రతీ గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని, అభివృద్ధికి ప్రజలు సహకరించాలని కోరారు. ప్రభుత్వ పథకాలను పేదలు పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని ఆయన సూచించారు.