హైదరాబాద్: 28°C
తెలంగాణ

మంతూర్‌లో బొడ్రాయి ప్రతిష్ఠా కార్యక్రమం

సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలం మంతూర్‌లో నిర్వహించిన బొడ్రాయి ప్రతిష్ఠా కార్యక్రమానికి దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా బొడ్రాయి అమ్మవారి అనుగ్రహం దుబ్బాక నియోజకవర్గ ప్రజలపై ఎల్లవేళలా ఉండాలని, ప్రజలు పాడిపంటలతో, సుఖసంతోషాలతో, సుభిక్షంగా జీవించాలని ఆకాంక్షించారు.