మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల మండల కేంద్రంలో గురువారం నిర్వహించిన పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి హాజరయ్యారు. దేవాలయం వద్ద ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ.. అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని కాంక్షిస్తున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక మండల నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
తెలంగాణ
విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం హాజరైన మాజీ ఎమ్మెల్యే


