హైదరాబాద్: 28°C
తెలంగాణ

గిరిగేట్‌పల్లిలో 500కు పైగా SIR నోటీసులు

VKB: వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని 11వ వార్డు గిరిగేట్‌పల్లిలో SIRపై గ్రామ సభ నిర్వహించారు. 118, 119 బూత్‌ల పరిధిలో 500కుపైగా రిటర్న్ నోటీసులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. వాటిని ఓటర్లకు అందజేశారు. మిగిలిన నోటీసులను ఆన్‌లైన్‌లో నమోదు చేసి అందజేయనున్నట్లు చెప్పారు. నోటీసులకు అవసరమైన ధ్రువపత్రాలను జతచేసి ఈ నెల 31లోగా అధికారులకు అందించాలని అన్నారు.