హైదరాబాద్: 28°C
తెలంగాణ

'నేడు, రేపు భక్త మార్కండేయ స్వామి వారి ఉత్సవాలు'

WNP: జిల్లా కేంద్రంలోని పాతకోటలోని శ్రీ భక్త మార్కండేయ స్వామి ఆలయంలో నేటి నుంచి ఉత్సవాలు ప్రారంభమవుతాయని పట్టణ పద్మశాలి సంఘం సభ్యులు తెలిపారు. సాయంత్రం 6 గంటలకు కలశ స్థాపన, అభిషేకం, రాత్రి 9 గంటలకు అఖండ భజన నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. రేపు సామూహిక యజ్ఞోపవీతధారణ, సర్వసభ్య సమావేశం, నూతన కమిటీ ఎన్నిక ఉంటాయని తెలిపారు.