హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అప్రోచ్ రోడ్డు కోతతో ప్రమాదాల ముప్పు

కృష్ణా: మోపిదేవి మండలం కొక్కిలిగడ్డలో సింహాద్రి వారధి వంతెనకు ఉన్న అప్రోచ్ రహదారి కోతకు గురై బలహీనంగా మారుతోంది. దీంతో రహదారి ప్రమాదాలకు నిలయంగా మారిందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అప్రోచ్ రహదారిని పటిష్ఠం చేయాలని, లేదంటే వాహనదారులు ప్రమాదాలకు గురికాకుండా రివిట్‌మెంట్ నిర్మించాలని అధికారులను కోరుతున్నారు.